NTV Telugu Site icon

AP Crime: ఏపీలో ప్రేమ జంట ఆత్మహత్య.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు..

Love Couple

Love Couple

AP Crime: చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు.. పెళ్లికి అంగీకరించడంలేదని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది.. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రేమజంట రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది.. మృతులు.. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా, కులదీప్ పరియార్ లు గా గుర్తించారు రైల్వే పోలీసులు.. మధ్యప్రదేశ్ కి చెందిన ప్రతాప్ సింగ్, కులదీప్ పరియర్ లు గుంతకల్లు పట్టణంలోని నివాసిస్తూ.. పానీపూరి విక్రయించి జీవనం సాగిస్తున్నారు. అయితే, ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా గుంతకల్లులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇదే సమయంలో.. మధ్యప్రదేశ్ చెందిన కులదీప్‌తో ప్రేమలు పడింది.. ఈ వ్యవహారం పెద్దల వరకు చేరింది.. కానీ, వారి పెళ్లికి పెద్దలు కాదనడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది..

Read Also: Kushi Sequel: ఖుషి సీక్వెల్ ఇక లేనట్లేనా..?

మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మ హత్య చేసుకోగా.. ఆ ఘటన సమీపంలో నోట్ బుక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. మృతులను మధ్యప్రదేశ్ కు చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా, కులదీప్ పరియార్ లుగా గుర్తించారు.. గుంతకల్లులో కసాపురం రోడ్డులో రామలింగ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్నారు.. మా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదు అంటూ నోట్ బుక్ లో రాసుకున్నారు.. అయితే, పెద్దలు అంగీకరించకపోవడంతో.. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం.. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Show comments