Site icon NTV Telugu

Kethireddy Pedda Reddy: రోడ్డుపై బైఠాయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రికి అనుమతిచ్చేవరకు ఇక్కడే కూర్చుంటా..!

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి ఎంట్రీకి బ్రేక్‌ వేశారు పోలీసులు.. హైకోర్టు ఆదేశాలతో ఉదయం తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని నారాయణరెడ్డి పల్లె వద్ద అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో, రోడ్డుపై బైఠాయించారు పెద్దారెడ్డి.. దాదాపు 4 గంటలుగా నారాయణరెడ్డి పల్లె వద్ద రోడ్డుపై బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే, తాడిపత్రి వైపు వెళ్లకుండా బారికేట్స్ ఏర్పాటు చేసిన పోలీసులు.. భారీగా మోహరించారు.. కానీ, పెద్దారెడ్డి వచ్చే సమయంలోనే తాడిపత్రిలో శిశుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. దీంతో, ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది..

Read Also: Condom Packets: వ‌ర‌ద‌లో భారీగా కొట్టుకు వ‌చ్చిన కండోమ్స్.. ఇన్ని ఏంటయ్యా?

అయితే, తనను తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేంత వరకు రోడ్డుపైనే బైఠాయిస్తాను అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం.. హైకోర్టు తీర్పు వల్లే 14 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను.. కానీ, హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. వైసీపీ శ్రేణులు సమన్వయం పాటించాలి.. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు అని విజ్ఞప్తి చేశారు.. అసలు నేను తాడిపత్రి వెళ్తేనే లా అండ్‌ ఆర్డర్‌ ఇష్యూ వస్తుందా? అవతలి వ్యక్తులు ఉంటే రాదా? అని ప్రశ్నించారు.. అసలు జేసీ చెప్పినట్టే పోలీసులు వింటున్నారంటూ దుయ్యబట్టారు.. నన్ను పోలీసులు అడ్డుకున్నారు.. శాంతి భద్రతల సమస్య ఏదైనా ఉంటే పోలీసులు చూసుకోవాలి.. కానీ, నన్ను అడ్డుకోవడం దేనికి అని ప్రశ్నించారు.. ఇంకా, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version