NTV Telugu Site icon

JC Prabhakar Reddy: జేసీ సంచలన వ్యాఖ్యలు.. నాకు కోపం, రోషం ఉంది.. కొట్టడం కూడా తెలుసు..!

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జేసీ.. తాజాగా ఫ్లైయాష్ అంశంలో తనను విమర్శించిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి బూతు పురాణంతో రెచ్చిపోయారు.. అసలు, ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదంతో నాకేం సంబంధం? అని ప్రశ్నించారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోపం, తాపం, రోషం ఉన్నా.. పక్కన పెట్టారన్న ఆయన.. నేను చంద్రబాబు అంత మంచి వాడిని కాదు.. నాకు కోపం, తాపం, రోషం ఉంది.. అలాగే కొట్టడం కూడా తెలుసు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు..

Read Also: Mad 2 : మ్యాడ్ 2 స్పెషల్ సాంగ్.. రంగంలోకి శ్రీవిష్ణు హీరోయిన్

ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని మండిపడ్డారు జేసీ.. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు.. ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని పిలుపునిచ్చారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతా అంటూ హెచ్చరించారు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తాడిపత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తున్నాడు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంగతి త్వరలోనే తేలుస్తా అన్నారు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ఊరు విడిపిస్తా.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటి పక్కన ఉన్న ఐటీఐ కళాశాల భూమిని కబ్జా చేసి గేటు పెట్టాడని ఆరోపించారు.. డిసెంబర్ 4వ తేదీ లేదా 5వ తేదీన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి గేట్లు పగలగొడతా అంటూ హెచ్చరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..

Show comments