JC Prabhakar Reddy: పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్‌చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా… నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆరోపిస్తున్నారు జేసీ.. గతంలో జిల్లా ఎస్పీ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రవాణా శాఖ అధికారులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అప్పటి రవాణా మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా పోలీసులు పట్టించుకోకపోవడంతో… జిల్లా జడ్జికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.. ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. తనకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదు.. దీనిపై హైకోర్టుకు వెళ్తాను… అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని అంటున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కాగా, గత వైసీపీ ప్రభుత్వంలో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పలు కేసులు ఎదుర్కొన్న విషయం విదితమే.. అయితే, తమపై కక్షపూరితంగానే కేసులు పెట్టారని ఆరోపిస్తూ వచ్చింది జేసీ ఫ్యామిలీ.. ఆయా కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్ కూడా అయిన విషయం తెలిసిందే..
Read Also: Telangana Ministers: భూపాలపల్లి జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర పర్యటన..