JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది.. ఏది ఉన్నా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు జేసీ.. అది సొంత పార్టీ నేతలైనా.. లేదా ఇతర పార్టీలకు చెందినవారైనా ఆయన తీరు అలాగు ఉంటుంది.. అయితే, జేసీ రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఆరోపణల వచ్చిన నేపథ్యంలో.. అవును.. నేను రౌడీనే.. అందుకే నా ఊరు బాగుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరూ మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతే.. నన్ను ఒక్కడినే గెలిపించారని గుర్తుచేశారు జేసీ.. ఇక, తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్లు.. వాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు..
Read Also: Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు..
అనంతపురం జిల్లా డీపీవో అనేక అక్రమాలకు పాల్పడ్డాడు.. ఆయన అక్రమాలకు పాల్పడలేదని ఆయననే చెప్పమనండి అంటూ సవాల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేను తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి కారణం అప్పుడు ఉండే నాయకుల్లో నాకు కనిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.. ఎందుకంటే ఆయన విజన్ ఉన్న వ్యక్తి అంటూ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.. నాకు న్యాయం చేస్తానంటే నేను ఎవరి దగ్గరికి అయిన ఆధారాలు తీసుకొని వస్తాను అన్నారు.. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు నాలా బతకలేదన్న జేసీ.. మా చంద్రబాబు నాయుడుకి విధేయుడిని… ఆయన కూర్చోమంటే కూర్చుంటా.. లేయమంటే లేస్తాను అన్నారు.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా.. గత ఐదు సంవత్సరాలు నేనే కష్టపడ్డాను అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత, తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
