Site icon NTV Telugu

ASP vs JC Prabhakar Reddy: తాడిపత్రి అడిషనల్ ఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్..

Jc

Jc

ASP vs JC Prabhakar Reddy: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి జెడ్పీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మధ్య వివాదం చెలరేగింది. ఎవరైనా పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ ఏఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రోహిత్ చౌదరి పేర్కొన్నారు. ఇక, తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Read Also: Thamma Movie Review: ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక మొదటి సినిమా ‘థామా రివ్యూ’

ఇక, నా 73 ఏళ్ల వయస్సులో ఇలాంటి ఏ ఎస్పీని నేను ఎక్కడా చూడలేదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రోహిత్ కుమార్ చౌదరి ఏ ఎస్పీగా పనికి రాడన్నారు. రాళ్ల దాడి జరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఘర్షణ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు.. తాడిపత్రిలో నువ్వు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గలేదు.. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది అన్నారు. నువ్వు బయటికి రావాలంటే ఎస్ఐ, సీఐ, కానిస్టేబుల్ లేనిది బయటికి రాలేవని సెటైర్లు వేశాడు. డీఎస్పీ చైతన్య కంటే నువ్వు పనికిరాని వాడివి.. మీ ఇంటి ముందు వచ్చి పడుకొని నిరసన తెలిపితే జవాబు లేదు.. ఎస్పీని చూసి మౌనంగా ఉన్నాను లేదంటే మీ ఇంట్లోకి దూరే వాడిని అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version