Site icon NTV Telugu

Google Maps: కొంప ముంచిన గూగుల్‌ మ్యాప్స్‌.. లోయలోకి భారీ కంటైనర్..

Google Maps

Google Maps

Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌ నమ్ముకొని వెళ్తే.. అసలుకే ఎసరు వస్తుంది.. ముఖ్యంగా రాత్రి సమయంలో గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని.. కొండనాల్లో.. కోనల్లో.. ప్రాజెక్టుల్లో కొట్టుకుపోయి ప్రాణాలు పోగుట్టుకున్నవారి సంఖ్య పెద్దదే.. మరికొందరు.. గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని.. తిరిగినచోటే తిరిగిన అనుభవాలు ఎన్నో.. ఏదో చిన్న బండో.. కారు కాదో.. ఏకంగా ఓ ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న భారీ కంటైనర్‌ ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది.. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని కొండల్లోకి లోడ్‌తో ఉన్న కంటైనర్‌తో వెళ్లిపోయాడు ఓ డ్రైవర్‌.. కర్ణాటక రాష్ట్రం నుండి తాడిపత్రికి ఐరన్ లోడుతో బయలుదేరింది కంటైనర్‌.. అయితే, రాత్రి సమయంలో దారి తెలియక గూగుల్ మ్యాప్‌ని ఆన్ చేశాడు డ్రైవర్ ఫరూక్.. ఇక, ఆ మ్యాప్‌ను ఫాలో అయిపోయాడు.. అది సరాసరి యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి తీసుకెళ్లింది.. తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత లోయలోకి ఒరిగిపోయింది ఆ భారీ కంటైనర్.. ఇక చేసేది ఏమీ లేక.. అసలు విషయం తన యజమానికి చేరవేశాడు.. జేసీబీల సాయంతో ఆ భారీ కంటైనర్‌ను పైకి తీయించారు..

Read Also: Union Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ హైలెట్స్ ఇవే

Exit mobile version