Anantapur: పరకామణి కేసులో కీలక సాక్షి అయిన మాజీ ఆర్వీఎస్ఓ సతీష్ కుమార్ హత్యపై గుత్తి రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. హరి ఫిర్యాదు మేరకు గుత్తి జీఆర్పీ పోలీసులు 103(1)BNS సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. సతీష్ కుమార్ హత్యకు సంబంధించి అనంతపురంలో సమీక్ష చేసిన సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఆ తర్వాత తాడిపత్రి మండలం కోమలి దగ్గర జరిగిన హత్య సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు.
Read Also: Minister Seethakka : ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడాలి..
ఇక, సతీష్ కుమార్ మృతదేహం వద్ద మొబైల్ ఫోన్ ఎలా దొరికింది అని సీఐడీ అడిషనల్ డీజీ రవి శంకర్ అనుమానించారు. దాదాపు 30 నిమిషాల పాటు క్షుణ్ణంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాసేపట్లో మొత్తం విషయాన్ని హైకోర్టుకు సీఐడీ డీజీ సమర్పించనున్నారు. సీటులో ఉన్నాడా.. ఎందుకు సీటులో పడుకోలేదనే దానిపై విచారించమని రైల్వే పోలీసులకు సీఐడీ డీజీ ఆదేశించారు. అలాగే, కాసేపట్లో సతీష్ కుమార్ హత్యకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
