Andhra Pradesh: దొంగతనాలకు అడ్డూ అదుపు లేదన్నట్టుంగా పరిస్థితి ఉంది.. అయితే, కాస్త సమయం తీసుకున్నా.. ప్రస్తుత టెక్నాలజీతో ఏ దొంగనైనా పట్టుకుంటున్నారు పోలీసులు.. సిటీలు, పట్టణాల వరకు ఈ పరిస్థితి ఉన్నా.. గ్రామాల్లో దొంగతనం జరిగితే.. పట్టుకోవడం కాస్త కష్టమే.. మరోవైపు, దేవాలయాలను కూడా టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు కొందరు దొంగలు.. అయితే, ఆ దేవుడు అంటే భయంతో.. కొందరు దొంగలు.. తాము దొంగిలించిన సొమ్మును.. తిరిగి ఆ గుడిలోనే పెట్టివెళ్లారు.. ఆ సొత్తుతో పాటు.. ఓ లెటర్‌ను కూడా వదిలివెల్లారు..
Read Also: Kanaka Durga Temple: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలపై సర్కార్ ఫోకస్..
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయంలో నెల రోజుల క్రితం హుండీ చోరీ జరిగింది.. అయితే, అనూహ్యంగా చోరీ సొత్తును నిన్న రాత్రి ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లారు దొంగలు.. ఇక, సదరు దొంగలు పడేసి వెళ్లిపోయిన నగదును వెలికితీసి పోలీసుల సమక్షంలో లెక్కించారు స్థానికులు.. ముసలమ్మ గుడిలో దుండగులు వదిలి వెళ్లిన అమ్మవారు హుండీ సొమ్ము లెక్కించగా రూ.1,86,486గా తేలింది. ఆ సొత్తుతో పాటు ఓ లేఖను కూడా పెట్టారు దొంగలు.. హుండీని నలుగరం కలసి చోరీ చేశామని లేఖలో పేర్కొన్నారు.. అయితే, దొంగతనం చేసినప్పటి నుంచి తమ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండడం లేదని.. భయంతో అమ్మవారి డబ్బును ఆలయం దగ్గర వదిలేసి వెళ్లినట్లు… లేఖ రాసి నగదు పెట్టిన సంచిలో వేశారు దొంగలు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. విచారణ చేపట్టారు పోలీసులు..
