CM Chandrababu: అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ వేదికగా ఎమ్మెల్యేలకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేను కామన్ మ్యాన్ గా ఉన్నాను.. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలని స్పష్టం చేశారు.. మనం ప్రజలకు సేవకులం.. పాలకులం కాదన్న ఆయన.. దర్జాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని సూచించారు.. ఇష్టమొచ్చినట్లు చేయడం సరికాదు అని హితవుచెప్పారు.. ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా, అధికారి తప్పు చేసినా.. అది ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుందని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉండే మనం చిత్తశుద్ధిగా ఉండి ప్రజలు అభినందించేలా, మనల్ని ఆచరించే విధంగా ఉండాలని అని హితవు చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: TG News: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం.. ఈ తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు…
ఇక, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనకు అన్నంపెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చాం అన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్రంతో కలిసి ఏడాదికి 3 విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నాం. తొలి విడతగా ఇప్పటికే రూ. 7 వేలు ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశాం. నీళ్లిచ్చాం… మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం… మార్కెట్ గిట్టుబాటు ధర వచ్చేలా చేశాం. ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చారని తెలిపారు.. ఆర్ధిక కష్టాలున్నా…అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే రూ.1704 కోట్లు ఖర్చు చేసి… 2.45 కోట్ల ఉచిత సిలిండర్లు మహిళలకు ఇచ్చాం. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే… ‘దీపం 2’ సూపర్ హిట్ అన్నారు..
Read Also: Nayanthara : నయనతార రూ.5 కోట్లు ఇవ్వు.. మరో కాంట్రవర్సీ
కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. అన్ని వర్గాల ప్రభుత్వం. అందరి జీవితాలు మార్చే ప్రభుత్వం అన్నారు చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ దసరాకు కానుక ఇస్తున్నారు… జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు.. ధరలను తగ్గిస్తున్నారు. పన్నులను తగ్గించడం వంటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీని అభినందించాలన్నారు.. యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చాం. దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయి. మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు… నేనేదో పొడిచేశానని మాట్లాడుతున్నాడు. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ అయిపోదు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం టీడీపీనే. 17 కాలేజీలు ఉంటే.. ఒక్క కాలేజీ మాత్రమే పూర్తి అయింది. ఫౌండేషన్ వేయడం… రిబ్బన్ కట్ చేయడం… నేనేదో చేశానని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ కి రండి.. మెడికల్ కాలేజీలపై చర్చిద్దాం అని సవాల్ చేశారు.. ఇక, ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు.. అసెంబ్లీకి రాని వాళ్ళు రాజకీయాలకు అర్హుడా..? అని ప్రశ్నించారు.. రప్పా రప్పా అంటే… ఇక్కడ ఉన్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అని హెచ్చరించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెట్పీటీసీ ఎన్నికల్లో రప్పా రప్పా అని బెండుతీశారని ఎద్దేవా చేశారు.. వైసీపీది దృతరాష్ట్ర కౌగిలి… ఎవరు బలి కావొద్దు అని సూచించారు.. ఐదేళ్ళు ప్రజల ముఖాలలో నవ్వు లేదు.. మేము అధికారంలోకి వచ్చాక స్వేఛ్ఛ ఇచ్చాం అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
