Ananthapuram: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జంతు బలులపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వేట కొడవళ్ళతో బహిరంగ ప్రదేశాల్లో.. రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొల్పే విధంగా.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా జంతు బలి చేసిన వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని భానుకోట, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రంలో వేట కొడవళ్ళతో పొట్టేళ్ల బలి ఇచ్చారు.
Read Also: Tollywood 2025: స్టార్ పవర్ ఉన్నా కంటెంట్ లేకపోతే కష్టమే.. 2025 టాలీవుడ్ నేర్పిన పాఠం!
అయితే, జంతు బలి ఇచ్చి వేటకొడవళ్ళతో హంగామా సృష్టించిన వారికి పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ ను అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల పోలీసులు ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రంలో వేట కొడవళ్లతో జంతు బలి చేసిన వారిని నడిరోడ్డుపై నడిపించి ఊరేగించారు. అలాగే, రాప్తాడు నియోజకవర్గం భానుకోటలో జంతు బలి చేసిన వారిని నడిరోడ్డుపై ఊరేగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక, పలు సెక్షన్ల కింద జంతు బలికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, జంతు సంక్షేమ చట్టాల ప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
