Anantapur: ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను మొదటి ఏడాదిలోనే ప్రజలకు అందించిన నేపథ్యంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభను ఈనెల 10న అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. భారీ ఎత్తున ఈ సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు చేశారు.. ఈనెల 10వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ఆ ఒక్కరోజు వాహనదారులు ఈకింది ఆంక్షలు పాటించి పోలీసులతో సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ పి.జగదీష్.. సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు భారీ ఎత్తున ప్రజలు సదరు విజయోత్సవ సభలో పాల్గొనే అవకాశమున్నందున.. వాహనాల రాకపోకలు కొనసాగేందుకు పోలీసు వారు సూచించిన ఆంక్షలు తప్పకుండా పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎస్పీ..
పోలీసుల ఆంక్షలు.. ట్రాఫిక్ మళ్లింపు..
* హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట – బుక్కరాయసముద్రం – నాయనపల్లి క్రాస్ – నార్పల క్రాస్ – బత్తలపల్లి – ధర్మవరం – ఎన్‌ఎస్ గేట్ – NH-44 మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది..
* కర్నూల్ నుంచి తిరుపతి/చెన్నై వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట – బుక్కరాయసముద్రం – నాయనపల్లి క్రాస్ – నార్పల క్రాస్ – బత్తలపల్లి – కదిరి – మదనపల్లె మార్గంలో ప్రయాణించాలని సూచించారు.
* బళ్లారి నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా చెల్లికేర – తుమ్కూరు – నెలమంగళ – బెంగళూరు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
* బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా ఎన్‌ఎస్ గేట్ – ధర్మవరం – బత్తలపల్లి – నార్పల క్రాస్ – నాయనపల్లి క్రాస్ – బుక్కరాయసముద్రం – వడియంపేట – NH-44 మార్గంలో ప్రయాణించాలని తెలిపారు.
* తిరుపతి/చెన్నై వైపు నుంచి కర్నూల్ వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ తప్పించుకుని కదిరి – బత్తలపల్లి – నార్పల క్రాస్ – నాయనపల్లి క్రాస్ – బుక్కరాయసముద్రం – వడియంపేట – NH-44 మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
* బెంగళూరు నుంచి బళ్లారి వెళ్లే వాహనాలు అనంతపురం తప్పించుకుని బెంగళూరు – నెలమంగళ – తుమ్కూరు – చెల్లికేర మార్గంలో ప్రయాణించాలని ఓ ప్రకటనలో కోరారు అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్..
