NTV Telugu Site icon

Pandu Ranga Temple: ఆ గుడికి వేల సంఖ్యలో మందుబాబులు క్యూ కడుతారు.. ఎందుకో తెలుసా?

Panduranga Temple

Panduranga Temple

Pandu Ranga Temple: ఇటీవల మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగడం మానేయడానికి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే మద్యం మానివేయగల దేవుడు ఉన్నాడని మీకు తెలుసా? నిజమే, ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల మనిషిలోని చెడు గుణాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మాలధారణ మాదకద్రవ్యాలకు విరుగుడు? అవుననే అంటున్నారు మందు బాబులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఆ ఆలయానికి వెళ్లి పూలమాలలు వేస్తే మద్యానికి దూరంగా ఉండాల్సిందే అని అంటున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామిని ఆంధ్ర పుండరీపురంగా ​​పిలుస్తారు. ఆలయ గొప్పతనం గురించి తెలియని మందు బాబులు ఇక్కడ లేరంటే అతిశయోక్తి కాదు. తాగుబోతులను పోగొట్టే దైవంగా ఉంతకల్లులో వెలసిన పాండురంగ స్వామి రుక్మిణి సమేతంగా తాగుబోతుల నుంచి పూజలు అందుకుంటున్నాడు. వినడానికి కాస్త వింతగా అనిపించినా.. నెలలో రెండు రోజులు పాండురంగ స్వామి ఆలయం మందు బాబులతో కిటకిటలాడుతుంది.

Read also: Health Tips: టీ తాగుతూ సిగరెట్ తాగుతున్నారా..?

ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో పాండురంగ స్వామిని కొలిస్తే. మెడలో పాండురంగ స్వామి దండ ఉంటే తాగి చాలా దూరం పరిగెత్తేవాడట. జన్మలో మద్యం జోలికి వెళ్లరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పాండురంగ స్వామి మాల మాసంలోని శుక్త ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లో మాత్రమే ధరించాలి. తాగుబోతులు మాత్రమే పాండురంగ స్వామి మాల ధరించడం చాలా ఏళ్లుగా ఆచారం. స్వామివారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మందు తాగడం మానేయాలనే దృఢ సంకల్పంతో మాలధారణ చేయాలనుకునే వారు ఉదయాన్నే స్నానం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి భక్తుల మెడలో పాండురంగ స్వామి మాల వేస్తారు. పాండురంగ స్వామి మాలధారణ చేసిన వారికి మళ్లీ మద్యం ముట్టిన దాఖలాలు లేవని ప్రధాన అర్చకులు చెబుతున్నారు. మద్యానికి బానిసలైన వారు స్వామివారి ఆలయానికి వచ్చి మాలధారణ చేసిన తర్వాత మద్యానికి దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడుపుతారన్నారు.
Flipkart Offers: రూ.1కే ఆటో రైడ్‌.. ఎగబడుతున్న జనం!

Show comments