Anantapur: అనంతపురం పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న హరి కుటుంబం, బెలుగుప్ప మండలం తగ్గుపర్తికి చెందిన భువన్ చక్రవర్తి ఓకే అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఒకరు, గ్రౌండ్ ఫ్లోర్లో మరొకరు నివాసం ఉంటున్నారు. అయితే, ఇటీవల చిన్న పిల్లలు ఆడుకునే విషయంలో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలకు దిగారు.
అయితే, ఈ గొడవ కాస్త పెద్దల మధ్య వివాదానికి దారి తీయడంతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. భువన్ చక్రవర్తి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజ బంధువు అని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన తీసుకోలేదని ఆర్ కానిస్టేబుల్ హరి ఆరోపించారు. ధర్మతేజ, ఆయన అనుచరులు తమపై దాడి చేశారని ఆరోపిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు. కాగా, ఎమ్మెల్యే అల్లుడి అండదండలు చూసుకుని తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదనీ పేర్కొన్నారు.
Read Also: Kerala : సబరిమలలో బంగారం దొంగతనం..! ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుపై తీవ్ర ఆరోపణలు..
మరోవైపు ఏఆర్ కానిస్టేబుల్ హరి, ఆయన భార్య తమపై దాడికి దిగాడని భువన్ చక్రవర్తి, ఆయన భార్య ప్రతి ఆరోపణలు చేసింది. ఈ ఘర్షణ తర్వాత ఇరు వర్గాలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరోకరు కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు.
