NTV Telugu Site icon

ఆనంద‌య్య మెడిసిన్‌…జంతువుల‌పై ట్ర‌య‌ల్స్…

ఆనంద‌య్య త‌యారు చేసిన మెడిసిన్‌పై విజ‌య‌వాడ‌, తిరుప‌తి ఆయుర్వేద విశ్వ‌విద్యాల‌యాల్లో ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి.  ఒక‌వైపు మెడిసిన్ తీసుకున్న వ్య‌క్తుల‌కు సంబందించిన డేటాను పరిశీలిస్తున్నారు. మ‌రోవైపు జంతువుల‌పై ఈ మెడిసిన్‌ను ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించేందుకు అధికారులు సిద్ద‌మ‌య్యారు.  తిరుప‌తిలోని మంగాపురం వ‌ద్ద ఉన్న యానిమ‌ల్ ల్యాబ్‌లో జంతువులపై ప‌రిశోధ‌న చేయ‌నున్నారు.  ఈ ప‌రిశోధ‌న‌లకు సంబందించిన నివేధిక 14 రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తుడా చైర్మ‌న్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పేర్కొన్నారు.  4 ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన అనంత‌రం ప్ర‌భుత్వ నివేదిక ఆధారంగా మందుని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని చెవిరెడ్డి పేర్కోన్నారు.  మందు పంపిణీకి అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పేర్కొన్నారు.