నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసే కరోనా మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు.. కొందరు మందుకు తీసుకోవడానికి వెళ్లకపోయినా.. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందును తిరిగి ప్రారంభించారంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు.. ఇవాళ్టి నుంచే మందు పంపిణీ చేస్తున్నారంటూ పుకార్లు సృస్టించారు.. దీంతో.. వందలాది మంది కృష్ణపట్నం బాటపట్టారు.. అక్కడివరకు వెళ్లినవారికి నిరాశే ఎదురవుతోంది.. వట్టి ప్రచారానికి ప్రజలు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి.. దీంతో… ఓ వీడియోను విడుదల చేశారు ఆనందయ్య.. మందు పంపిణీని కొట్టిపారేసిన ఆయన.. ఇప్పుడు ఎలాంటి మందు పంపిణీ చేయడం లేదని.. ప్రభుత్వం నుంచి అనుమతి లేదని.. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తానని వెల్లడించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే.. మందు పంపిణీ చేస్తానని ప్రకటించారు ఆనందయ్య.
కరోనా మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ… మళ్లీ అప్పుడే..!
Anandaiah