NTV Telugu Site icon

Anakapally incident: నేరం అంగీకరించిన పుష్ప

Puspa1

Puspa1

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కాబోయే భర్త పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా రావికమతంలో వరుడు పై వధువు చాకుతో దాడిచేసిన సంగతి తెలిసిందే. వరుడు రామునాయుడు పై తానే దాడి చేసినట్లు ఒప్పుకుంది వధువు పుష్ప. భక్తి మైకంలో ఉన్న పుష్ప ..తనకు పెళ్ళి వద్దంటు తను దేవుని భక్తురాలిగా ఉంటానంటూ పలు మార్లు తల్లిదండ్రులకు తెలిపింది.

ఇప్పటికి రెండు పెళ్లి చూపులు కాన్సిల్ కావడంతో మూడవది ఒప్పించారు తల్లిదండ్రులు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిన పుష్ప.. నిన్న వరుడ్ని బయటకు తీసుకెళ్ళి చంపాలనుకుంది. అనుకున్న ప్రకారమే షాపు లో చాకు కొనుగోలు చేసింది. దేవుడు సన్నిధికి తీసుకెళ్ళి కళ్ళకు చున్నీ కట్టీ పీక పై కోసింది యువతి. నా కూతురు ఇష్టప్రకారమే ఈ పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నామన్నారు పుష్ప తల్లిదండ్రులు. నిన్న మా ఇంటికి వచ్చిన రామునాయుడు మా అమ్మాయిని బయటకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో నేను ఇంట్లో లేనన్నారు.

బయటికి తీసుకెళ్లిన రామునాయుడు నా కూతురితో చాకు కొనిపించాడంటున్నారు. తన కుమార్తెకు ఎటువంటి పాపం తెలియదు. రోడ్డు ప్రమాదంలో అల్లుడికి గాయం అయ్యిందని అమ్మాయి చెబుతోందన్నారు పుష్ప తండ్రి. ఈ కేసుకి సంబంధించి అనేక విషయాలు వెల్లడించారు అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్.

ఎలాగైనా పెళ్ళి అపాలని దాడి చేసి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుందన్నారు డీఎస్పీ సునీల్ కుమార్. సర్ ప్రైజ్ అని చెప్పి చాకుతో గొంతు కోసిందని, తను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని తనను తాను కాపాడుకుంటూ వదువును కాపాడాడు వరుడు. వధువు పుష్ప ను అరెస్టు చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.