NTV Telugu Site icon

YS Jagan: ఫార్మా బాధితులకు పరామర్శ.. ప్రభుత్వం తీరుపై జగన్‌ అభ్యంతరం..

Jagan

Jagan

YS Jagan: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరం అన్నారు.. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించ కూడదు అనే తాపత్రయం కనిపించిందని దుయ్యబట్టారు.. హోం మంత్రి సహాయచర్యలు పర్యవేక్షణ కోసం వెళుతున్నాను అనే మాటే చెప్పలేదు.. ఫ్యాక్టరీలు ఏ శాఖ పరిధిలోకి వస్తుందో పరిశ్రమల మంత్రికి తెలియదు… ఎంత మంది చనిపోయారు తెలియదని చెప్పారు.. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా పంపలేకపోయారు.. కంపెనీ బస్సుల్లో బాధితులను తరలించాల్సి వచ్చిందంటు మండిపడ్డారు.. అదే, LG పాలిమర్ ప్రమాదం అర్ధరాత్రి జరిగితే కలెక్టర్, పోలీసులు, అంబులెన్సులు సంఘటనా స్థలికి హుటాహుటిన తరలించాం.. 11 గంటలకు నేను స్పాట్ కు వచ్చాను అని గుర్తుచేసుకున్నారు. కోవిడ్ ఇబ్బందులు అధిగమించి సైతం రెస్క్యూ చేశాం… తొలిసారి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించామన్నారు.

Read Also: Breaking: నేపాల్‌లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు..

అయితే, అచ్యుతాపురం ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరం అన్నారు జగన్‌.. ప్రభుత్వం అనేది సానుభూతి, బాధ్యత తో వ్యవహరించాలన్న ఆయన.. జగన్ హయాంలో ప్రమాదాలు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు.. మరి చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాల సంగతేంటి? అని ప్రశ్నించారు. ప్రస్తుత సీఎస్‌ నీరాబ్ కుమార్ కమిటీ వేసి వైసీపీ ప్రభుత్వం హయంలో సమగ్ర నివేదిక రూపొందించి అమలు చేశాం.. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్ పార్టీ ఆడిట్ లు, సేవలు దుబాటులోకి తీసుకుని వచ్చామని తెలిపారు. ప్రతీ పరిశ్రమను తనిఖీ చేసిన తర్వాత అందులో వెలుగు చూసిన లోపాలను సరిదిద్ది కోవడానికి గడవు ఇచ్చి ప్రోటో కాల్ ఖచ్చితంగా పాటించేలా జీవో ఇచ్చామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం మానేశారు… ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్ మీద, సంక్షేమ పథకాల అమలు మీద లేదు.. కేవలం రెడ్ బుక్ మీదనే ధ్యాస్ వుంది… రెడ్ బుక్ తెరవడం దానిని ఫాలో అవ్వడం మాత్రం కనిపిస్తోందని విమర్శించారు.

Read Also: S.Kota Sub Registrar Suspended: రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి సిసోడియా పర్యటన ఎఫెక్ట్‌.. అధికారులపై చర్యలు షురూ

స్కూళ్లు, హాస్పిటల్లో, పరిశ్రమలు ఇలా అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తునారని ఆరోపించారు వైఎస్‌ జగన్‌.. ఆరోగ్య శ్రీ, విద్యా దీవెన కింద బకాయిలు విడుదల చేయడం లేదు.. రోగులు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రైతులకు పెటుబడు సహాయం ఒక్క రూపాయి ఇవ్వలేదు.. 2023-24 ఇన్సూరెన్ ప్రీమియం చెల్లించని కారణంగా రైతుల బీమా ఎగిరిపోయింది.. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది… రాష్ట్రంలో కక్షలు, హింస తప్ప పాలనలో మంచి చేయాలనే పరిస్థితులు లేవు అన్నారు. పరిహారం సానుభూతితో సరైన సమయంలో ఇవ్వాలి.. హాస్పిటల్లో బాధితులకు ఒక్క రూపాయ కూడా అందలేదని విమర్శించారు.. గతంలో తెచ్చిన పరిశ్రమలపై ప్రొటోకాల్ పాటించాలి.. పరిశ్రమలో SOP లు బాగా జరిగేవి కానీ ప్రమాదానికి కారణాలు తెలియవని బాధితులు చెప్పారని మీడియాకు వివరించారు వైఎస్‌ జగన్‌.. ప్రొటోకాల్ ఖచ్చితంగా అమలు చేయడం , సేఫ్టీ పరా మీటర్స్ పాటించాలి…. మూడు వారాలు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాను… పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుంది. స్వయంగా నేనే ధర్నాకు వస్తాను …ఇది ప్రభుత్వానికి హెచ్చరిక అంటూ హాట్‌ కామెంట్లు చేశారు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..