Site icon NTV Telugu

Speaker Ayyanna Patrudu: ఏ పార్టీ అయినా సరే భూ సమస్యకు కారణమైతే కేసులే.. స్పీకర్‌ ఆదేశాలు

Speaker Ayyanna Patrudu

Speaker Ayyanna Patrudu

Speaker Ayyanna Patrudu: మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఈ పాసు పుస్తకాలు శాశ్వతమైనవని, వీటి పంపిణీ రాజకీయాలకు అతీతంగా జరగాలని సూచించారు. గ్రామీణ రైతులకు భూ హక్కులపై భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

Read Also: BRS Boycott Assembly: రేపు అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్.. సీఎంపై హరీష్ రావు ఫైర్

భూ వివాదాలు, భూ సమస్యలకు కారణమైన వారిపై పార్టీలతో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్ అధికారులకు స్పీకర్‌ నేరుగా ఆదేశాలు జారీ చేశారు. “ఏ పార్టీ అయినా సరే, రైతుల భూముల విషయంలో అన్యాయానికి కారణమైతే చట్టం తన పని తాను చేస్తుంది.. కేసులు తప్పవు” అంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్న ఆయన.. రాజకీయాలకతీతంగా పాస్‌ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.. అయితే, భూ సమస్యలకు కారణమైన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు స్పీకర్‌ చింతకాలయ అయ్యన్నపాత్రుడు..

Exit mobile version