Janasena: అనకాపల్లిజిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్ సూర్యచంద్రకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పార్టీ ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని., భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక వీడియో వెలుగులోకి రాగా.. వైరల్ గా మారింది. వివాహం కోసం వైవాహిక బంధాన్ని తెంచుకుని వస్తే మోసం చేశారని వాపోయింది. అయితే, విచారించి కేసు నమోదు కోసం పోలీసులు ఇరు వర్గాలను పిలిపించారు. అంతకు ముందే లావణ్య మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇద్దరి మధ్య సమస్యను కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటా మని… అసలు తన వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె కొద్ది గంటల వ్యవధిలోనే రెండో వీడియో విడుదల చేసింది. సూర్య చంద్రపై ఆరోపణలు, లావణ్య వీడియో వైరల్ కావడంతో చర్యలకు పూనుకుంది జనసేన పార్టీ.. నర్సీపట్నం ఇంఛార్జ్‌గా ఉన్న సూర్యచంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది జనసేన పార్టీ..
Read Also: Rashmika: జపాన్ ప్రేక్షకుల ప్రేమకు ఫిదా అయిన రష్మిక.. ఎమోషనల్ పోస్ట్!
