NTV Telugu Site icon

Gudivada Amarnath: సాయిరెడ్డిపై అమర్నాథ్‌ కౌంటర్‌ ఎటాక్.. ఆత్మ పరిశీలన చేసుకోండి..!

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్.. విజయసాయిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించిన ఆయన.. మొన్నటి వరకు సాయిరెడ్డి చెప్పిన పూజారుల్లో ఆయన ఒకరు కదా…? అని ప్రశ్నించారు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది… జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి.. అది ప్రతీ వ్యవస్థలో భాగం.. మొన్నటి వరకు కోటరీలో వున్న సాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని ఫైర్‌ అయ్యారు..

Read Also: Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు..

పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఇంత కంటే గొప్పగా మాట్లాడతారని భావించలేం అంటూ సాయిరెడ్డిపై సెటైర్లు వేశారు అమర్నాథ్.. మరొకరి మీద ప్రేమ పుడితేనే మనసులు విరిగిపోతాయి.. రాజీనామా తర్వాత ఇక ఏ రాజకీయ పార్టీలో చేరనని చెప్పిన మాటలకు నిన్నటి వ్యాఖ్యలకు తేడా కనిపించిందన్నారు. 2024లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి వుంటే ఇప్పుడు వెళ్లిపోయిన వాళ్లు.. ఎలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు.. ఈ విధంగా స్పందించే వాళ్లా..? అని నిలదీశారు.. ప్రతీ మంగళవారం అప్పులు చెయ్యడం కోసం బటన్ నొక్కుతున్నారు.. తప్ప ప్రజలకు మేలు చేసేందుకు మాత్రం చంద్రబాబుకు చేతులు రావడం లేదన్నారు.. ఎన్నికల కోడ్ కారణంగా మా ప్రభుత్వం హయంలో విద్యాదీవెన ఒక్క క్వార్టర్ మాత్రమే పెండింగ్ వుంది… 4 వేల 500 కోట్లు తక్షణం విడుదల చెయ్యాలని తల్లిదండ్రులు, విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో అధికార, విపక్షలతో పాటు ప్రభుత్వ పక్షం అనే టీమ్ ఒకటి తిరుగుతోంది.. అటువంటి బ్యాచ్ లకు అధికారంలో ఉన్న వాళ్లు తప్ప రాజకీయాలతో సంబంధం ఉండన్నారు.. ఇక, కాకినాడ సీ పోర్టు పై ఎటువంటి విచారణ అయిన చేసుకోవచ్చు.. కానీ, వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందిన మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్‌..