Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Water: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లాకు చేరుకున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 9 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించనున్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్లు ఖర్చు చేసింది. కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలతో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో జిల్లాలో సాగునీటి లభ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఇక, ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
Also Read
- Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
- Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
తాజావార్తలు
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!