CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరమ్మతులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామం పరవాడ జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటు కావాలి.. 5 ఏళ్లు గుంతలు తవ్వాడు.. రాష్ట్రానికి ప్రమాదమైన గోతులు తవ్వాడు.. నరకానికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్ర రోడ్లు మార్చారు అని దుయ్యబట్టారు.. వెయ్యి కోట్లు మాత్రమే ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టాడు అంటే పరాకాష్ట.. రోడ్ల మీద డెలివరీలు అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.. రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయి.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. గుంతలు పడ్డ రోడ్లు ప్రయాణం ప్రాణాలతో చెలగాటం.. రోడ్డు ప్రమాదాలతో నిత్యం సమస్యలే.. రోడ్లు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు వస్తుంది, దళారులు దోచుకొకుండా ఉండి వ్యాపారాలు బాగుంటాయి .. జనవరి కల్లా రోడ్లు గుంతలు పూడ్చి వేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు సీఎం చంద్రబాబు..
Read Also: CM Revanth Reddy: మీ ప్రకటనలో అపోహలు.. అవాస్తవాలు.. ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్..
గుంతలు రోడ్లో చేపలు పట్టుకునేలా చేశారు అని సెటైర్లు వేశారు చంద్రబాబు.. రౌడీ రాజకీయాలు వద్దు అభివృద్ధి కావాలి.. బురద లేని రోడ్లు వేసే బాధ్యత మాది, మళ్ళీ ఆ రాక్షసుడిని రానివ్వకుండా చేసే బాధ్యత మీది.. రోడ్లు బాగోలేక RTC బస్సులను కూడా రద్దు చేసిన పరిస్థితి వచ్చింది.. మళ్ళీ మంచి రోజులు వచ్చాయి.. ఈ గ్రామం నుండి మొదలు.. ఈ రోజు విజయనగరంలో ప్రోగ్రామ్ ఉంది కానీ ఇక్కడకి వచ్చాను.. వచ్చినపుడు పరదాలు కట్టుకొచ్చానా, చెట్లు నరికించానా.. ప్రజలు గెలవాలంటే NDA ను గెలిపించాలని అడిగాను.. 90% మెజారిటీతో గెలిపించారు.. రాష్ట్రానికి ఎప్పుడు అయితే పన్నులు వస్తాయో అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి తొడ్పడతాయి అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడు.. గత పాలకుల చేష్టలకు సమర్థవంతమైన అధికారులు నిర్వీర్యం అయిపోయారు.. గాడి తప్పిన అన్ని వ్యవస్థలను మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడమే మా లక్ష్యం అన్నారు సీఎం.. 5 ఏళ్లలో అన్ని రోడ్లు ఎలా అభివృద్ధి చేయాలో స్పష్టమైన అవగాహనతో మీ ముందుకు వస్తాం.. 76 వేల కోట్ల రూపాయలు తో నేషనల్ హై వే పనులు అవుతున్నాయి.. రెండున్నారేళ్లులోనే పూర్తి చేయాలని ఆదేశించాం అన్నారు.