Vangalapudi anitha: నేడు అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించనున్నారు. జిల్లాలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటలకు పాయకరావుపేట నియోజకవర్గంలోని యస్. రాయవరం మండలం బంగారమ్మ పాలెం గ్రామంలో తుఫాను ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలన చేయనుంది. అనంతరం బంగారమ్మ పాలెం గ్రామంలో తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర వస్తువులను మంత్రి అనిత పంపిణీ చేయనుంది.
Read Also: Karuppu : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న కోలీవుడ్ స్టార్..!
ఇక, ఉదయం 11 గంటలకు యలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలో ముంపుకు గురైన గ్రామాలను మంత్రి అనిత పరిశీలించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో తమలపాకుల తోటలను పరిశీలించి, బాధిత రైతులతో ఆమె మాట్లాడనున్నారు.
