Site icon NTV Telugu

MP CM Ramesh: ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తా..!

Cm Ramesh

Cm Ramesh

MP CM Ramesh: ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తా అని వ్యాఖ్యానించారు ఎంపీ సీఎం రమేష్.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం చూడలేక వైఎస్‌ జగన్ భయంకర వాతావరణ సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు పోయినా ఇంకా జగన్ మారలేదన్నారు.. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న ఆయన.. గుజరాత్‌లో విజయవంతంగా నడుస్తున్న PPP విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తుందన్నారు.. 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న అయ్యన్నపాత్రుడు గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్పీకర్ అయ్యన్నపాత్రుని ఎదుర్కొనే ధైర్యం ఉంటే జగన్ ఒకసారైనా అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు.. నీ కోసం ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరతానని తెలిపారు సీఎం రమేష్‌.. వైఎస్‌ జగన్ అసెంబ్లీకి వెళ్తే తన ప్రభుత్వంలో చేసిన అక్రమాలు బయటపడతాయన్న భయం ఉందని దుయ్యబట్టారు.. అసెంబ్లీని ఫేస్ చేయలేని ప్రతిపక్ష నాయకుడు జగన్ అని సెటైర్లు వేశారు.. అయితే, జగన్ ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్తే నేను జగన్ కు సెల్యూట్ చేస్తా అని ప్రకటించారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్..

Read Also: Telanagana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేత.. సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారు?

Exit mobile version