MLC Bommi Israel: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు చంద్రబాబు దగ్గరే పని చేస్తానంటున్నారు.. ఆయన తన పార్టీని విలీనం చేస్తారని కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేరుగా ఫోన్ చేసి ఇంకెప్పుడు నోరు జారొద్దంటూ హెచ్చరించారు. ఫోన్ కాల్ అనంతరం జనసేన ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ కౌంటర్ ఇస్తూ.. పార్టీని స్థాపించినందుకు పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని తాను సూచన మాత్రమే చేశానని వెల్లడించారు
ఇక, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అనేక మంది అగ్ర నాయకులు విమర్శలు చేస్తున్నారని వారందరినీ తిట్టే ధైర్యం మీకు ఉందా అని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ప్రశ్నించారు. మీ తాటాకు చప్పుళ్ళకు ఇక్కడ ఎవరు భయపడే పని లేదని తేల్చి చెప్పారు. ఇకపై కూడా విమర్శిస్తూనే ఉంటానని వెల్లడించారు.
