NTV Telugu Site icon

AP Crime: రియల్‌ ఎస్టేట్‌ అన్నాడు.. కోట్లు ముంచి పరారయ్యాడు..

Ap Crime

Ap Crime

AP Crime: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ సుమారు నాలుగున్నర కోట్ల వరకు ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులు తీసుకున్నాడు.. మూడు నెలలుగా డబ్బులు అడుగుతుంటే సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో, బాధితులు పదే పదే అడగడం ప్రారంభించారు. చివరకు ఇల్లు విడిచి పరారవ్వడంతో బాధితులంతా రోడ్డున పడ్డారు.

Read Also: Mahakumbh 2025 : నేడు మహా కుంభమేళాలో అమిత్ షా పవిత్ర స్నానం.. నిన్ననే పాల్గొన్న అఖిలేష్

పూర్తి వివరాల్లోకి వెళ్తే. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన కర్రీ వెంకటరెడ్డి (దొరబాబు) మాచవరం గ్రామంలో సొంత ఇంటి కలిగి ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అనుకునే పలువురు అతని వద్ద డబ్బులు వడ్డీకి ఉంచారు. మాచవరం, సోమేశ్వరం గ్రామాలతో పాటు అనపర్తి మండలం పులగుర్త, రామకోట గ్రామాలకు చెందిన 45 మంది దొరబాబు వద్ద డబ్బులు పెట్టారు.. ఈ విధంగా సుమారు 4.5 కోట్ల రూపాయల వరకు దొరబాబు దగ్గర పొదుపు చేసినట్టు బాధితులు తెలిపారు. సుమారు మూడు నెలలుగా దాచుకున్న డబ్బులను తమ తిరిగి ఇవ్వాలని దొరబాబుని కోరినప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. మరోవైపు.. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో దొరబాబు ఇంటి వద్ద లేకుండా పోవడంతో బాధితులంతా దొరబాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు.. తాము దాచుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలంటూ బాధితులు కోరుతున్నారు.