NTV Telugu Site icon

Prabhala Theertham: కొత్తపేటలో అంగరంగ వైభవంగా ప్రభల ఉత్సవం ప్రారంభం..

Prabala Teertham

Prabala Teertham

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు ప్రభల ఉత్సవాన్ని చూసేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ప్రభల ఉత్సవం జరపడం కొత్తపేటలో ఆనవాయితీగా వస్తుంది. ప్రభల ఉత్సవాలు మూడు ప్రధాన వీధుల మధ్య పోటాపోటీగా జరుగుతుంది. ముందుగా పాత రామాలయం మనసేబు గారి ప్రభ వీరభద్రుని అలంకరించుకొని పురవీధుల్లోకి వస్తుంది. మిగిలిన ప్రభలు పురవీధుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపుగా బయలుదేరాయి.

Read Also: Los angeles Wildfires: లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో హాలీవుడ్ నటి సజీవదహనం

బోడిపాలెం వద్ద భక్తాంజనేయ స్వామి వారి ప్రభగా అలంకరించుకుని రెండవ ఊరేగింపుగా బయలుదేరి.. కొత్త రామాలయం ప్రభ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించుకుని ఆయా వీధుల ప్రభలను వెంటబెట్టుకుని మూడవ ఊరేగింపుగా మొదలైంది ప్రభలు. అనంతరం.. కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకుని భక్తుల సందర్శనార్థం కొలువై ఉంటాయి. వివిధ రకాల విద్యుత్ కాంతులు బాణాసంచా కాల్పులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. తిరిగి రాత్రి 11 గంటలకు పురవీధులలో ఊరేగుతూ బాణాసంచా వివిధ రకాల సంస్కృతికి కార్యక్రమాల మధ్య ఊరేగుతూ తెల్లవారుజామున నాలుగు గంటలకు పాత బస్టాండ్ సెంటర్ వరకు చేరుకుంటాయి. పాత కొత్త రామాలయాల ప్రభల ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పోటాపోటీగా బాణాసంచా కాల్పులతో ప్రబల ఉత్సవాలు ముగుస్తాయి.

Read Also: ESIC IMO Recruitment 2025: ఈఎస్ఐసీలో 608 జాబ్స్.. తక్కువ కాంపిటిషన్.. నెలకు రూ. 56 వేల జీతం

Show comments