NTV Telugu Site icon

Land Dispute: రాజోలులో భూ వివాదం.. సర్పంచ్, వార్డు మెంబర్లపై రాపాక తోడల్లుడు దాడి..

Rajolu

Rajolu

Land Dispute: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఘర్షణ చోటు చేసుకుంది.. మల్కీపురం మండలం అడవిపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో గ్రామ సర్పంచ్, ఆమె భర్త, వార్డు మెంబర్లపై దాడి జరిగింది.. 2021లో నూతనంగా ఏర్పడింది అడవిపాలెం పంచాయతీ.. అయితే, నూతన పంచాయతీకి భవనం లేకపోవడంతో 1 ఎకరం 96 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమిని సర్వే చేస్తున్న సమయంలో రగడ మొదలైంది.. కొంత మంది దళితులు 1 ఎకరం 96 సెంట్లు భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి..

Read Also: Papikondalu Tour: పాపికొండలు పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి ప్రారంభం..

ఇక, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్వయానా తోడల్లుడు ఎకరం 96 సెంట్లు భూమిలో కొంత భూమిని కబ్జా చేసి.. డూప్లెక్స్ భవన నిర్మాణం చేశారని.. ఎంపీ నిధులతో తన ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయించారని విమర్శలు ఉన్నాయి.. అయితే, పంచాయతీ.. బోర్డు నెంబర్లు తీర్మానం మేరకు ప్రభుత్వ భూమి ఎకరం 96 సెంట్లు భూమిని సర్వే చేస్తున్న సమయంలో రగడ మొదలైంది.. సర్వేయర్‌కి సమీపంలో నిలబడి ఉన్న సర్పంచ్, ఆమె భర్త, వార్డు నెంబర్లపై మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తోడల్లుడు, అనుచరులు దాడి చేశారని చెబుతున్నారు.. ఈ ఘటనలో ఒకరికి తలకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు..