NTV Telugu Site icon

Dwarapudi: ద్వారపూడిలో 60 అడుగుల ఆదియోగి విగ్రహం.. రేపే ప్రారంభం

Dwarapudi Adiyogi Statue

Dwarapudi Adiyogi Statue

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిచెందిన అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహాన్ని శివరాత్రికి ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తయినవి ఉండగా.. ద్వారపూడి అయ్యప్ప దేవాలయంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో మూడో అతి పెద్ద విగ్రహం రూపుదిద్దుకుంటుంది. ఈనెల 26న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5.30 గంటలకు విగ్రహం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో లోపలకు ప్రవేశమార్గం ఉంది. అందులో శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ధ్యానం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: Jharkhand shocker: దారుణం.. పెళ్లి నుంచి వస్తున్న ఐదుగురు బాలికపై 18 మంది గ్యాంగ్ రేప్..

ద్వారపూడిలో ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. శివరాత్రికి ఈ విగ్రహాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి అయ్యాయి. భారతదేశంలో అతి పెద్ద ఆదియోగి విగ్రహాలలో ఈ విగ్రహం మూడోవది. ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో లోపలకు ప్రవేశమార్గం ఉంది. ఇందులో శివలింగం ఏర్పాటు చేశారు. ఆదియోగి విగ్రహానికి ఎదురుగా వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు నమస్కరిస్తున్నట్లు ఏర్పాటు చేశారు. విగ్రహానికి నాలుగు పక్కల వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, గౌతమ మహర్షి, కశ్యప బ్రహ్మరుషి భరద్వాజ మహర్షి, జమదగ్ని మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి విగ్రహాలు ధ్యానం చేస్తున్నట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో అర్ధనారీశ్వర విగ్రహం, వినాయకుడు, కుమారస్వామి, నటరాజ విగ్రహం, కృష్ణార్జునులు, అనంత పద్మనాభస్వామి , నంది విగ్రహాలు ఉన్నాయి. కాగా.. ఆకట్టుకుంటున్న ఆదియోగి విగ్రహాన్ని దర్శించడానికి భక్తులు క్యూ కడుతున్నారు.

Read Also: Ducati DesertX Discovery: మార్కెట్‌లోకి డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ బైక్.. ధర తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!