Pension Money: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మతిస్థిమితం లేని ఓ మహిళ యొక్క వృద్ధాప్య పెన్షన్ డబ్బులను కుటుంబ సభ్యులు కాజేస్తున్నారు. మానవత్వం లేకుండా మతిస్థిమితం లేని మహిళను కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన మద్ధింశెట్టి బంగారమ్మకు అమలాపురం బస్ స్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. కానీ, ఆ మతిస్థిమితం లేని వృద్ధురాలుకు వచ్చే పెన్షన్ ను మాత్రం నెల నెల వచ్చి కుటుంబ సభ్యులు పట్టుకుపోతున్నారు. ఈరోజు (ఫిబ్రవరి 4) కూడా సచివాలయం ఉద్యోగిని తీసుకు వచ్చి ఆ మహిళ వేలిముద్రలు తీసుకుంటూ ఉండగా అక్కడే ఉన్న స్థానిక ఆటోడ్రైవర్లు, పండ్ల వ్యాపారులు అడ్డుకున్నారు.
Read Also: Mohammed Shami: ప్రపంచ రికార్డుకు దగ్గరలో టీమిండియా స్టార్ బౌలర్..
ఆ మతిస్థిమితం లేని ఓ మహిళ యొక్క వేలి ముద్రలు ఎందుకు తీసుకొంటున్నారని కుటుంబ సభ్యులను స్థానికులు ప్రశ్నించారు. ప్రతీ రోజూ వృద్ధ మహిళకు భోజనం పెడుతున్నామని స్థానిక ఆటో డ్రైవర్లు, పండ్ల వ్యాపారులు వెల్లడించారు. ఈరోజు పెన్షన్ డబ్బుల కోసం వచ్చిన కుటుంబ సభ్యులను అడ్డుకుని నిలదీశారు. ఆమెకు వచ్చే పెన్షన్ కావాలి కానీ.. ఆ వృద్ధ మహిళ మీకు అవసరం లేదా అంటూ మండిపడ్డారు. తక్షణమే ఆమెను ఇంటికి తీసుకోని వెళ్లాలని స్థానికులు తెలిపారు.