Site icon NTV Telugu

Deputy CM Pawan: కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..

Pawan

Pawan

Deputy CM Pawan: అంబేద్కర్ కోనసీమ జిలాల్లో ఈరోజు (నవంబర్ 26న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 9.45 గంటలకి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఇక, ఉదయం 9.50కి రాజమండ్రి నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 10.10 గంటలకు రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురం మండలం గూడపల్లి హెలీప్యాడ్ దగ్గరకు చేరుకోనున్నారు. ఉదయం 10.15 నిమిషాలకు బయలుదేరి 11 గంటల వరకు కేశనపల్లి గ్రామంలో సముద్ర జలాల ప్రభావంతో నాశనమైన లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించి.. అనంతరం బాధిత రైతులతో ముఖాముఖి ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడనున్నారు.

Read Also: Astrology: నవంబర్‌ 26, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!

అయితే, ఉదయం 11 గంటలకు కేశనపల్లి నుంచి రోడ్డు మార్గాన రాజోలు మండలం శివకోటిలోని సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. 11.20 నిమిషాలకు శివకోటి గ్రామానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం సభా స్థలికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే, మధ్యాహ్నం 12.20 గంటలకు శివకోటిలోని హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుని హెలికాప్టర్ లో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ నుంచి హైదరాబాద్ కు డిప్యూటీ సీఎం పవన్ వెళ్లనున్నారు.

Exit mobile version