Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు (ఫిబ్రవరి 7) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరగనుంది. నేటి రాత్రి 10:30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరగనుంది. అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి అంతర్వేది ఆలయాన్ని ముస్తాబు చేశారు. స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కళ్యాణం తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Vivekanandan Viral: ‘వివేకానందన్ వైరల్’ అంటూ వస్తున్న దసరా విలన్ . . ఆహా ఓటీటీలోకి కొత్త సినిమా !
ఇక, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం కోసం గోదావరి జిల్లాల నలుమూలల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ. అలాగే, వెయ్యి మంది పోలీసు సిబ్బందితో 9 సెక్టార్లుగా పోలీస్ బందోబస్తు మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ఎస్పీ, అడిషనల్ ఎస్సీ, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలతో ఉత్సవాల్లో బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో 20 డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఎన్టీఆర్ఎఫ్, స్పెషల్ పార్టీ, మెరైన్ పార్టీలతో పర్యవేక్షణ కొనసాగుతుంది. దీంతో పాటు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డిజిటల్ డిస్ప్లే, 12 ఎస్ఈడీ స్క్రీన్లతో భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించే అవకాశం కల్పించారు. క్యూలైన్లలో పటిష్టమైన బారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. ఆరు ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు చేయగా.. కళ్యాణం తర్వాత భక్తులకు అక్షింతలు పంపిణీ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.