NTV Telugu Site icon

అసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు : అంబటి

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అయితే వర్షాల కారణంగా భారీ వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీంతో వరదలు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటించి వరద బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని అలాగే పలు వరాల జల్లులను కురిపించారు. ఆ తరువాత టీడీపీ నేతలు జగన్‌ పర్యటపై పలు విమర్శలు చేశారు.

దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. అసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, గతంలో ఎన్నడూ చూడని భారీ వర్షాలు, వరదలు వచ్చాయని ఆయన అన్నారు. అంతేకాకుండా వరద బాధితులు జగన్‌తో ఆప్యాయంగా మాట్లాడటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఊహించని విధంగా అన్నమయ్య ప్రాజెక్టుకు వరదలు పోటెత్తడంతో దెబ్బతిందన్నారు.