NTV Telugu Site icon

Ambati Rambabu: పోలవరం ఆలస్యానికి టీడీపీయే కారణం

Ambati

Ambati

ఉద్దేశ్య పూర్వకంగా పోలవరం ప్రాజెక్ట్‌కి వైసీపీ అడ్డంకి అని చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖకి లేఖ రాశారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు బాబు వైఖరి ఉందని దుయ్యబట్టారు. టీడీపీ అలసత్వం వల్లనే పోలవరం పూర్తి కాలేదు. ట్రాన్‌స్ట్రాయ్ ని తీసేసి నవయుగకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది బాబు. చంద్రబాబు రాసిన లేఖను కేంద్రం చూడను కూడా చూడదు చెత్త బుట్టలో వేస్తారన్నారు.పోలవరం కుంటుపడింది అని చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ లెటర్ రాసారు. పోలవరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్ట్ అన్నారు అంబటి రాంబాబు.

పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్ వే, ఇతర పనులు పూర్తి చెయ్యలేదు.డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం చంద్రబాబు, దేవినేని ఉమ వైఖరి. వుందన్నారు. డయాఫ్రమ్ వాల్ ఎంతవరకు దెబ్బతిందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీలో పోలవరం పై చర్చ జరుపుదాం. శాసనసభ సాక్షిగా డయాఫ్రామ్ వాల్ ఎలా కొట్టుకుపోయింది చర్చిద్దాం అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌ అని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి జనంలోకి వెళ్తున్నామన్నారు. భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించేందుకే ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి అంబటి చెప్పారు.

దుష్టచతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మోసాలు తప్ప త్యాగాలు చేయలేదని ధ్వజమెత్తారు. ఎవరినో సీఎంను చేసేందుకు పెట్టిన పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమందిని కలుపుకొచ్చినా ఎన్నికల్లో భంగపాటు తప్పదని, సంక్షేమ సైనికుల అండతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు.

Naresh: పవిత్రా లోకేష్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం అదే..!