Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు

  • అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు..
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో బారికేడ్లను తోసేసిన అంబటి..
  • పట్టాభిపురం పీఎస్ లో కేసు నమోదు.. ఈ నెల 11లోపు అంబటిని హాజరుపర్చాలని కోర్టు ఆదేశం..
  • చంద్రబాబును దూషించిన కేసులో రేపు అంబటి బెయిల్ పిటిషన్ పై తీర్పు..
Ambati

Ambati

Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే అంబటిపై కేసు నమోదు అయింది. ఈ కేసును పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన పోలీసులు తాజాగా పీటీ వారెంట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఈ నెల 11వ తేదీలోపు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాంబాబును రేపు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ పిటిషన్‌లపై రేపు మొబైల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.