NTV Telugu Site icon

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రితో అంబటి భేటీ

Ambati New

Ambati New

తెలుగు రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు (polavaram project) వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. గోదావరి వరద (godavari floods) పెరిగితే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇబ్బందులు తప్పడం లేదు. పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో బుధవారం సీఎం జగన్ కూడా పర్యటించారు. అక్కడి బాధితులకు భరోసా కల్పించారు. కేంద్రంపై వత్తిడి తెచ్చి పరిహారం త్వరగా వచ్చేలా చూస్తామంటున్నారు. ఇదిలా వుంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంపై కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ కోసం బుధ‌వారం ఢిల్లీ వెళ్లిన ఏపీ జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు (Ambati Rambabu) .. ఆ భేటీ అనంత‌రం మ‌రో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుల‌ను వెంట‌బెట్టుకుని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ శాఖ మంత్రి భూపింద‌ర్ యాద‌వ్‌ను అంబ‌టి రాంబాబు క‌లిశారు.

Arpita Mukherjee: మళ్లీ భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు..! నా ఇంట్లో ఛటర్జీ డబ్బులు దాచేవారు..

ఈ సంద‌ర్భంగా త‌న సొంత జిల్లా ప‌ల్నాడు జిల్లాలోని వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని రాంబాబు కోరారు. ప‌ల్నాడు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రికి రాంబాబు విన్న‌వించారు. దీనికి సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ట్వీట్ చేశారు. పల్నాడులో ఎంతో ప్రాధాన్యత ఉన్న వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భుపిందర్‌ యాదవ్‌ గారిని, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు, ఎంపీ మిథున్‌రెడ్డి గారు, నేను ఢిల్లీలో ఈరోజు కోరడం జరిగిందన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు. పోలవరానికి సంబంధించి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments