పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారు చంద్రబాబు. బీజేపీతో పార్ట్ నర్ గా ఉండి ప్రైవేటీకరణకు ఏది ఇచ్చినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా ఉంది పవన్ కళ్యాణ్ వైఖరి. విశాఖ ఉక్కు గురించి దీక్ష చేస్తున్న అన్న పవన్ కళ్యాణ్ ఉపన్యాసం లో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు. ఉపన్యాసం అంతా జగన్ కు 151 మొత్తం. వారసత్వ రాజకీయాలను ఎదుర్కొన్నాడు కనుకే మోడీ అంటే నాకు ఇష్టం అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చింది ఎక్కడ నుంచి అని ప్రశ్నించారు.
రాజకీయాల్లోనే వారసత్వాలకు వ్యతిరేకమా… సినిమాల్లో వారసత్వాలకు వ్యతిరేకం కాదా అని అన్నారు. అసలు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు?? లెక్కల్లో చెబుతున్నది ఎంత అని అడిగారు. కేంద్ర ప్రభుత్వం అప్పు 121 కోట్ల లక్షలు. మరి దేశాన్ని అమెరికాకు అమ్మేయాలంటారా అన్నారు. ఇక 1972లో దామోదరం సంజీవయ్య చనిపోయారు… పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు గుర్తు కు వచ్చారా అని పేర్కొన్నారు.
