మూడేళ్లలో 1.50 లక్షల కోట్లను సంక్షేమం కోసం జగన్ సర్కార్ వెచ్చించిందని… చంద్రబాబు హయాంలో క్రైస్తవులపై దాడులు జరిగాయని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడి జరగలేదని…కులాలు వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ వల్ల ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయని… ఓటీఎస్ పై తెదేపా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు మాటల్ని ప్రజలు ఎవరూ విశ్వ సించడం లేదని.. తన హయాంలో ఇళ్ల రుణాలను ఎందుకు మాఫీ చయలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టం ఉన్నవారు ఓటీఎస్ కోసం ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. ఓటీఎస్ లో బలవంతం ఏమీ లేదని చెప్పారు. రాష్టానికి హోదా కావాలని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ డిమాండ్ చేస్తోందని.. ప్రత్యేక హోదాపై మేము మాట తప్పం …మడమ తిప్పమన్నారు.
