మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు గుంటూరులో ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
