NTV Telugu Site icon

Amavasya Effect: విజయవాడకి అమావాస్య గండం.. రాత్రి 12 గంటల తర్వాత సాధారణ పరిస్థితి..!

Amavasya

Amavasya

Amavasya Effect: విజయవాడకి అమావాస్య గండం పొంచి ఉంది. ఈ అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉన్నది. పోటు మీదుంటే వరదని తనలోకి సముద్ర ఇముడ్చుకోదు.. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు మరింత పెరిగే అవకాశం ఉందనే భయం మొదలైంది. కాగా, ఎగువ నుంచి భారీగ వరద.. దిగువన సముద్ర పోటుతో ఏం జరుగుతుందోనని బెజవాడ ప్రజలు భీతిల్లుతున్నారు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత.. అమావాస్య గడియలు ముగిశాకే సాధారణ స్థితికి సముద్రం రానుంది.ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
అంచనా ప్రకారం వరద తగ్గుముఖం పట్టకుంటే నిజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా మారే సూచనలు ఉన్నాయి. మరో వైపు బుడమేరు వాగు ఉదృతి కొనసాగుతుంది.

Read Also: Dabar Coca Cola : కోకాకోలాను కొనుగోలు చేయనున్న డాబర్.. రూ.12000కోట్లకు డీల్

అయితే, ప్రకాశం బ్యారేజీకి అంతకంతు వరద ప్రవాహాం పెరగడంతో.. 11.3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈరోజు సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీలోని అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఇక, కృష్ణమ్మ పోటెత్తడంతో లంక గ్రామాలకు వరద నీరు భారీగా చేరుతుంది. అక్కడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

అలాగే, కృష్ణలంక ప్రాంతంలో కూడా వరద సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కోతకు గురి అవుతున్న కృష్ణ కరకట్టను పటిష్ట పరిచేందుకు స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక బస్తాలతో కరకట్టకు యువకులు మేరకపోస్తున్నారు. మరోవైపు రివర్ ప్రొటెక్టివ్ వాల్ సమీపంలోకి వేల సంఖ్యలో గేదెలు చేరుకుంటున్నాయి. సమీపంలోనీ వరద ప్రభావిత ప్రాంతం నుంచి గేదెలను తీసుకు వచ్చి పునరావాసం ఏర్పాట్లు చేస్తున్నారు.