Site icon NTV Telugu

Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్తో రైతుల సమావేశం

Crda

Crda

Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ తో రైతుల సమావేశం అయ్యారు. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. CRDA కార్యాలయం అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉంది.. రైతులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.. వాటిని CRDA కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నామని పేర్కొన్నారు. అమరావతి డీనోట్ చేయమని అడిగాం.. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చేస్తారని అధికారులు చెప్పారు.. R5 జోన్ లో కేటాయించిన వారికి స్థానికంగా ఉండే దగ్గర ఇచ్చి త్వరలో సెటిల్ చేస్తామన్నారు.

Read Also: Cloudflare Outage: క్లౌడ్‌ఫ్లేర్ ఎఫెక్ట్.. పని చేయని ప్రధాన సైట్లు.. ఎందుకో తెలుసా!

అయితే, సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విషయం త్వరలో మాట్లాడి పరిష్కరిస్తామన్నారని రైతులు తెలిపారు. అలాగే, కరకట్ట బలోపేతం చేయాలని కోరాం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు రాలేదని ప్రశ్నించాం.. గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరాం.. CRDA ఆధికారులు హేళనగా చూస్తున్నారు అని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని రైతులు వెల్లడించారు.

ఇక, గ్రీవెన్స్ లో సమస్యలు పరిష్కారం కాకుండానే అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయని అమరావతి రైతులు పేర్కొన్నారు. గ్రీవెన్స్ డిప్యూటీ కలెక్టర్ జయ శ్రీ పై కమిషనర్ కు ఫిర్యాదు చేశాం.. ఇప్పటి వరకు ఇచ్చిన గ్రీవెన్స్ ఫిర్యాదులు ఒకటి కూడా పరిష్కారం కాలేదని కమిషనర్ కు చెప్పాం.. గతంలో 14 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించగా వాటి గురించి ప్రశ్నించాం.. 1 రోడ్డు పోట్లు, 2 గ్రామ కంఠాలు, 3 జరీబు నాన్ జరీబు.. అంశాలు క్లిష్టతరమని కమిషనర్ చెప్పారు.. వాటన్నిటికీ కారణం గతంలో పని చేసిన ల్యాండ్స్ డైరెక్టర్ అనే విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని రైతులు చెప్పుకొచ్చారు.

Exit mobile version