NTV Telugu Site icon

Y. V. Subba Reddy: గెలుపు అవకాశాలు, అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను బట్టి సీట్లు మార్పు

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జగన్ తరపున తాను వైఎస్ షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం జరుగుతోంది అని అన్నారు. తాను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదని తెలిపారు. తాను మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని చెప్పారు. నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్ లో కలిశానన్నారు. కొద్దిసేపు కుటుంబ విషయాలపై విజయమ్మ, తాను మాట్లాడుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

AP High Court: సీఎస్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి ఏపీ హైకోర్టు నోటీసులు

చంద్రబాబును దత్తపుత్రుడిని సీఎం చేసేందుకు ఓ వర్గం మీడియా తమపై బురద జల్లుతున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కుట్రలు కుతంత్రాలు చేస్తూ, వైఎస్ కుటుంబ సభ్యులను బజారు కెక్కిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా.. సీఎం జగన్ కు నష్టమేమీ లేదని తెలిపారు. తామేమీ రాయబారాలు చేయాల్సిన పని లేదని చెప్పారు. ప్రజలే జగన్ ను మరోసారి ఆశీర్వదించి సీఎంను చేస్తారన్నారు. మరోవైపు.. షర్మిల గురించి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో లేదో తనకు సమాచారం లేదని చెప్పారు. సీఎం జగన్ వెంట మేమంతా ఉంటాం.. రాబోయే రోజుల్లో జగన్ ను సీఎంను చేసుకుంటామని పేర్కొన్నారు.

Karnataka: రామమందిర ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి అరెస్ట్.. హిందువులను వేధిస్తున్నారంటూ బీజేపీ ఫైర్..

షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లినా.. తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చేసే అభివృద్ది కార్యక్రమాలే తమకు విజయాన్ని అందిస్తాయని తెలిపారు. చాలా స్థానాల్లో వైసీపీ నష్ట పోకుండా ఉండేందుకే అభ్యర్థులను మార్చుతున్నాం.. వాస్తవ పరిస్థితులు, వేర్వేరు కారణాలతో సీట్లు మార్చుతున్నట్లు తెలిపారు. ఏడాది నుంచి మార్పుల విషయాన్ని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు చెబుతున్నారన్నారు. పలువురు ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్తున్నారని కొందరు సృష్టిస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీలు మారుతున్నారు.. వ్యక్తిగత కారణాలతోనే షర్మిల వెంట వెళ్లాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నిర్ణయమని చెప్పారు. సీట్లు ఇవ్వలేని వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని సీఎం హామీ ఇస్తున్నారని తెలిపారు. గెలుపు అవకాశాలను బట్టి, అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను బట్టి సీట్లు మార్పు ఉంటుందని అన్నారు. ఎన్ని సీట్లలో మార్పులు ఉంటాయన్నది ఇప్పుడేమీ చెప్పలేమని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.