YSRCP: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ.. వివిధ అంశాలపై పోరాటాలు నిర్వహిస్తూ వస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అందులో భాగంగా.. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5వ తేదీ వైసీపీ ఫీజు పోరు కార్యక్రమాన్ని తలపెట్టింది.. అయితే, ఈ నెల 5వ తేదీన తలపెట్టిన ఫీజు పోరు ఆందోళన కార్యక్రమాలను మార్చి 12వ తేదీకి వాయిదా వేసినట్టు వైసీపీ ప్రకటించింది.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాయిదా వేసినట్టు పేర్కొంది.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు వైసీపీ నేతలు.. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మార్చి 12వ తేదీన ఫీజు పోరు నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నాం అంటూ.. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
Read Also: Team India: ఇలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడూ చూడలేదు.. అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు