YS Jagan: తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉదయం 10.30 గంటలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో భేటీకానున్నారు.. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో చర్చించనున్న వైఎస్ జగన్..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాగా, నిన్న బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్.. సోమవారం రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంట పాటు సమావేశం అయ్యారు. తన భార్య వైఎస్ భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్.. ఇటీవలే అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ దంపతులు వాకబు చేసినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో.. జగన్ ఏం చర్చించి ఉంటారనే చర్చ సాగుతుండగా.. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు, హైదరాబాద్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయంలో సిట్ అధికారుల సోదాల నేపథ్యంలో గవర్నర్‌తో వైఎస్ జగన్ దంపతుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకోగా.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు.. తాజా రాజకీయ పరిణామాలతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది..
