NTV Telugu Site icon

Vijayasai Reddy Tweet on Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్‌ వైరల్..

Vijayasai Reddy Tweet

Vijayasai Reddy Tweet

Vijayasai Reddy Tweet on Pawan Kalyan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. అయితే, ఉన్నట్టుండి ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్‌ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది..

Read Also: Pushpa -2 : కేరళలో ప్రభాస్, మోహన్ లాల్, ముమ్మట్టి రికార్డ్స్ బ్రేక్

ఇక, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్‌లో తాజాగా చేసిన పోస్ట్‌ (ట్వీట్‌) విషయానికి వస్తే.. “ఏపీకి నాయకత్వం, ప్రాతినిధ్యం వహించటానికి ఏపీ ప్రభుత్వ ఎన్డీయే లీడర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆదర్శవంతమైన వ్యక్తి.. ” అంటూ ప్రశంసలు కురిపించారు విజయసాయిరెడ్డి.. ఇదే సమయంలో.. “ఏపీ లాంటి ఒక యువ రాష్ట్రానికి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించ లేడు” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సెటైర్లు వేసిన ఆయన.. “పవన్ కల్యాణ్‌కు ఉన్న జాతీయ ప్రజాదరణ, వయసు రీత్యా నేను ఇది నమ్ముతున్నాను..” అంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో రాసుకొచ్చారు.. అయితే, పవన్‌ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. పొలిటికల్‌ సర్కిల్‌గా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఇప్పటి వరకు జనసేనాని టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ.. ఆయన రాజకీయాలపై.. వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఇప్పుడు సడన్‌గా టర్న్‌ తీసుకుని ప్రశంసలు కురిపించడం ఏంటి? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

Show comments