YSRCP: సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం.. ఏపీ సీఈవోను కలిసిన టీమ్‌లో.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మెరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర నేతలు ఉన్నారు.. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మే 13వ తేదీన ఎన్నికలు జరిగితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి గెలుపు షాక్ ఇచ్చింది.. మొదట నమ్మలేకపోయాం అన్నారు. అయితే ఓట్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ పోలింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేసింది. భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్న ఆయన.. ఎన్నికలయ్యాక ఏపీలో 68.12 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఈసీ చెప్పింది. తర్వాత 76.5 శాతానికి పెరిగింది. ఫైనల్‌గా 80.66శాతంగా ప్రకటించారు. కౌంటింగ్ సమయంలో 82 శాతం పోలింగ్ జరిగినట్లుగా ఈసీ చెప్పిందన్నారు.
Read Also: Tollywood: టాలీవుడ్ సూపర్ ఫాస్ట్ – 10 సినిమా న్యూస్..
అయితే, ఎన్నికల సంఘం ఈ అనుమానాలు క్లియర్ చేయాలి. ఇవాల్టీ వరకు ఫామ్-20 అంటే ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు.. ఎవరికి పోల్ అయ్యాయని చెప్పలేదన్నారు అంబటి రాంబాబు.. ఇదోక అసాధారణమైన చర్య.. ఎందుకు ఆలస్యం అయింది. ఫైనల్ ఫిగర్‌కి కౌంటింగ్ ఫీగర్‌కి ఎందుకు తేడా వచ్చింది.. ఇది దురదృష్టం. ఎన్నికల నిర్వహణ పై అనేక అనుమానాలు ఉన్నాయి అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మరోవైపు.. 2024 ఎన్నికల ప్రొసీజర్ సరైన క్రమంలో లేదు.. పార్లమెంటరీ వ్యవస్థలో ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు.. విధానం అనుమానాలుకు తావిచ్చేలా ఉంది అన్నారు మాజీ మంత్రి మెరుగు నాగార్జున… ఈసీ వెంటనే స్పందించాలి. ఎన్నికల శాతం ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. ఎన్నికల శాతం పెంచుకుంటూ వెళ్లారు అని ఆరోపించారు మెరుగు నాగార్జున.