NTV Telugu Site icon

YSRCP boycott Governor Speech: గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన వైసీపీ..

Ycp

Ycp

YSRCP boycott Governor Speech: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం అన్ని రకాల్లో వైఫల్యం చెందిందని.. తమ ప్రభుత్వం అన్నింటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు.. అయితే, గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేశారు వైసీపీ సభ్యులు.. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమైన వెంటనే.. అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు సభ్యులు.. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఆ తర్వాత సభ వాకౌట్‌ చేశారు.. గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతుండగానే.. సభ నుంచి వెళ్లిపోయారు..

Read Also: Rana : ఓర్నాయనో.. బయట రూ.10కిలో ఇస్తుంటే రాణా షాపులో పావుకిలో టమాటా రూ.850 అట

ఇక, అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షం అవసరం అన్నారు బొత్స.. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కలని చూస్తున్నారని మండిపడ్డారు.. సభలో ఉన్నది రెండే పక్షాలు అని.. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి? అని నిలదీశారు.. మిర్చి రైతుల ఇబ్బందులు ప్రభుత్వ పట్టించుకోవటం లేదు. మా నేత జగన్ వెళ్ళే వరకు మిర్చి రైతుల ఇబ్బందులు పట్టించుకోలేదన్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేశాం.. మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. జగన్ మిర్చి రైతుల దగ్గరకు వెళ్లాక ఆలోచించడం మొదలు పెట్టారని తెలిపారు.. రైతులకు న్యాయం చేస్తే సంతోషం.. కానీ, అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలన్నారు.. మిర్చి రైతుల పరామర్శలకు వెళ్తే కేసులు పెడతారు అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. మ్యూజికల్ నైట్ కు ఇవేమీ ఉండవు అని దుయ్యబట్టారు.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం పై ప్రభుత్వ స్పందన తర్వాత అసెంబ్లీకి వస్తామో లేదో చెబుతాం. లేకపోతే ప్రజల్లో ఉండి పోరాటం చేస్తాం అని ప్రకటించారు బొత్స సత్యనారాయణ.