Site icon NTV Telugu

YS Jagan: అందరూ ధోనీల్లా తయారు కావాలి.. పార్టీ నేతలకు జగన్‌ దిశానిర్దేశం

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైసీపీ జిల్లా అధ్యక్షులతో సమావేశమైన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌.. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది.. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ ప్రతిభ బయటపడుతుంది.. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్‌ ప్రజలకు ఇష్టుడు అవుతాడు.. ఇదికూడా అంతే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్‌ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది.. ఇమేజీ పెరుగుతుంది.. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం.. అందరూ ధోనీల్లా తయారు కావాలి అంటూ సూచించారు వైఎస్‌ జగన్‌.

Read Also: Deputy CM Pawan Kalyan: అలా అయితే భారత్‌ను వదిలి పాక్‌కు వెళ్లిపోండి.. పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్‌..

జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి అని పిలుపునిచ్చారు జగన్.. కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి.. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటంచేయాలి.. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే.. బాధితులకు మనం అండగా ఉండాలి. మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు అని స్పష్టం చేశారు.. జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం అన్నారు.. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను.. కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి. పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు వైఎస్‌ జగన్‌..

Exit mobile version