Site icon NTV Telugu

YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్‌ ఆందోళన.. ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గత ఏడాదితో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు జగన్.. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది.. కానీ, ఇది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించిందన్నారు.. 2024 ఏప్రిల్ తో పోల్చితే 2025 ఏప్రిల్ లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది.. ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వ కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందని దుయ్యబట్టారు..

Read Also: CM Chandrababu: వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. సీఎం సీరియస్‌ వార్నింగ్

ఇక, సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన 796 కోట్ల రూపాయలు తగ్గిందనీ, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు వైఎస్‌ జగన్.. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారు. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను చేస్తోందని ఆరోపించారు.. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందన్నారు జగన్.. గతేడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి.. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయని గణాంకాలు బయటపెట్టారు.. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం అంటూ.. 2024 ఏప్రిల్‌.. 2025 ఏప్రిల్‌కు సంబంధించిన రెవెన్యూ, జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన కాగ్‌ పట్టికలను కూడా జత చేస్తూ ట్వీట్‌ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..

Exit mobile version